ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
VZM: ఎస్‌బీఐ ఆర్‌సెటీ ద్వారా గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ డి. భాస్కరరావు బుధవారం తెలిపారు. ఈనెల 6 నుంచి టైలరింగ్, ఎంబ్రాయిడరీ & ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోర్సులు నిర్వహిస్తామన్నారు. 18 నుంచి 50 ఏళ్ల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.