VIDEO: భక్తుడికి గుండెపోటు కాపాడిన కానిస్టేబుల్

TPT: శ్రీవారి దర్శనం చేసుకొని ప్రసాదం కోసం క్యూ లైన్‌లో ఉండి గుండెపోటు రావడంతో కింద పడిపోయిన శ్రీవారి భక్తుడు శ్రీనివాసులును తిరుమల వన్ టౌన్ కానిస్టేబుల్ గుర్రప్ప కాపాడారు. సమయస్ఫూర్తితో 90 సార్లు CPR చేశారు. సదరు భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతనిని అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి చేర్పించారు.