VIDEO: నీటి కోసం రైతుల ఆందోళన

PPM: తోటపల్లి ఎడమ కాలువ పాలకొండ మండలంలో చివర గ్రామాల ఆయకట్టు రైతులు పాలకొండ ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ నాయుడు, టీడీపీ రైతుల ప్రతినిధి బృందం ఇరిగేషన్ డీఈకి వినతి పత్రం అందజేశారు. ఆయకట్టు రైతులు తరఫున అభ్యుదయ రైతు ప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం సాగునీరు ఎప్పుడు ఇస్తారు? అని అధికారులను నిలదీశారు.