మహిళా మెడలో బంగారు గొలుసు చోరీ

మహిళా మెడలో బంగారు గొలుసు చోరీ

ఏలూరు సత్రంపాడులో శనివారం గుడికి వెళ్లి వస్తున్న ఓ మహిళ మెడలోని 4.5 కాసుల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు అపహరించాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన అగంతకుడు ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా చైన్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.