‘భారత్‌ ఎదుగుదలకు భయపడే సుంకాలు విధిస్తున్నారు’

‘భారత్‌ ఎదుగుదలకు భయపడే సుంకాలు విధిస్తున్నారు’

భారత్ అభివృద్ధి చెందుతున్నందున ఇతర దేశాలు తమ ఆర్థిక స్థానానికి ముప్పుగా భావిస్తున్నాయని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే అమెరికా వంటి దేశాలు భారత్‌పై సుంకాలు విధిస్తున్నాయని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రపంచ సమస్యలకు "నేను, నాది" అనే స్వార్థమే కారణమని, అందరూ కలిసి "మనం, మనది" అనే భావనను అలవర్చుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన హితవు పలికారు.