ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం.. కబోర్డు కూలి పసికందు మృతి
NRML: జిల్లాలోని సారంగాపూర్ విషాదం చోటుచేసుకుంది. చించోలి(బి) గ్రామానికి చెందిన గంగలక్ష్మి అనే మహిళ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువును శుభ్రం చేయడానికి మరో ప్రైవేటు పిల్లల ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్య సిబ్బంది శిశువును శుభ్రం చేస్తుండగా కబోర్డు విరిగి పసికందుపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన శిశువు మృతి చెందాడు.