మిస్ వరల్డ్ సుందరీమణుల కోసం ఏర్పాట్ల పరిశీలన

MBNR: రాజధాని హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో భాగంగా అక్కడికి వచ్చేవారికి ప్రభుత్వం తెలంగాణలోని పర్యటన ప్రదేశాలను చూపించనుంది. ఇందులో భాగంగా ఆయా దేశాల పోటీదారులు MBNRలోని పిల్లలమర్రికి వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు పిల్లలమర్రిలో జరిగే వేడుకలను జిల్లా ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, రూరల్ సీఐ పరిశీలించారు.