'టీడీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది'

GNTR: టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్ధాలను నిజాలుగా చూపిస్తోందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన బీసీ అనుబంధ విభాగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం ఒక మంచి అవకాశమని వెనుకబడిన కులాలన్నింటినీ చైతన్యపరిచి జగన్ వలనే భవిష్యత్తు ఉంటుందని వారికి వివరించాలని పిలుపునిచ్చారు.