రాయితీపై చేప పిల్లల పంపిణీకి సిద్ధం
అనంతపురం జిల్లాలో మత్స్య సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలని మత్స్య అభివృద్ధి అధికారి ఆసీఫ్ తెలిపారు. 2025-26 సంవత్సరానికి అనంతపురం, పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యాం సహా ఇతర మత్స్య క్షేత్రాల్లో 58.94 లక్షల చేప పిల్లలను పెంపొందించామని చెప్పారు. పీఎంఎంఎస్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.