'మోడీ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు మేలు'

'మోడీ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు మేలు'

ADB: భీంపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మండలాధ్యక్షుడు అంకం అశోక్ మండల నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.