'సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి'

BHPL: చిట్యాల మండలంలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇంఛార్జ్ రవి పటేల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కల్వపల్లిలో పంచిని మహేష్, ఆయన కుటుంబంపై ఆగస్టు 15న జరిగిన దాడిని ఖండిస్తూ.. దాడులు సమంజసం కాదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని అన్నారు. అనంతరం మహేష్‌ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపిస్తామని తెలిపారు.