పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం

VZM: గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఈవోపీఆర్డీ చల్లా సుగుణాకరరావు అధ్యక్షతన సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రమణ, ఉపాధ్యక్షులుగా కర్రి పార్ధునాయుడు, కార్యదర్శిగా దసన రోజీలీన, సంయుక్త కార్యదర్శిగా బెహర రమ్య, కోశాధికారిగా గంగుల తాతారావును ఎన్నుకున్నారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.