స్టేషన్ విస్తరించినా.. సరిపోని వెయిటింగ్ హాల్స్..!
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో భాగంగా వెయిటింగ్ హాల్స్ సంఖ్య పెంచి, ఓపెన్ స్పేస్ విస్తరించినా ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు. ప్రతి సంవత్సరం 15 శాతంపైగా ప్రయాణికులు పెరుగుతుండటంతో వేచిచూడడానికి స్థలం లేక రోడ్డు పక్కన, ఖాళీ ప్రదేశాల్లోనే నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. చలికాలంలో కూడా ఇదే దృశ్యం కనిపిస్తోంది.