రైతు సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నిక
KDP: అఖిల రైతు సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యునిగా తిరుమల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు తిరుమల్ రెడ్డి రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక రైతు సమాఖ్యలో కీలక పరిణామంగా మారింది.