జిల్లా కేంద్రంలో వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ వెలుగులోకి తెచ్చారు. ఏసీపీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం, పోస్టల్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.