'రైతన్న మీకోసం' పటిష్ట అమలుకు కలెక్టర్ ఆదేశం
సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి కార్యక్రమ ఉద్దేశాలు, ప్రయోజనాలు వివరించాలని, యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంలో సహాయపడాలని సూచించారు.