VIDEO: చంద్రబాబు ఏరియల్ సర్వే
AP: ఉత్తరాంధ్రలో నిర్మితమవుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.