బాలాపూర్ హుండీ ఆదాయం ఎంతంటే..?

RR: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీ ద్వారా మొత్తం రూ.23,13,760 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని కానుకలు సమర్పించినట్లు పేర్కొన్నారు.