జూనియర్ కళాశాల బిల్డింగ్ పూర్తి చేయాలి: PDSU
KMM: మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవన నిర్మాణం వేగవంతం చేయాలని PDSU నేతలు డిమాండ్ చేశారు. కళాశాలను సందర్శించిన అనంతరం మండల ఉపాధ్యక్షురాలు ఈశ్వరి మాట్లాడుతూ.. కొత్త భవనం మంజూరై 8 నెలలు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న గదుల్లో చదవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.