VIDEO: 1600 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
HYD: ఆపరేషన్ కవచ్ ఒక్క రోజుతో ఆగిపోదని భవిష్యత్తులోనూ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆపరేషన్ కవచ్‌లో భాగంగా 150 ప్రాంతాల్లో 5వేల మంది పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం 15 వేల వాహనాలను తనిఖీ చేయగా వాటిలో సరైన పత్రాలు లేని 1600 వాహనాలను సీజ్ చేశారు.