'పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలి'
SRD: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అన్నారు. జరా సంఘం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలపై ప్రజలు విసిగి చెందినట్లు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిస్తేనే ఎన్నికల ముందు హామీలు అమలు అవుతాయని పేర్కొన్నారు.