సర్వీస్ రోడ్డు సమస్య పరిష్కరించాలని వినతి
SRD: సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద సర్వీస్ రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఆదిత్య మాట్లాడుతూ.. సర్వీస్ రోడ్ సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులను ఆదేశించి సమస్య పరిష్కరించాలని కోరారు.