శిథిలాల నడుమ పది కుటుంబాలే జీవనం

శిథిలాల నడుమ పది కుటుంబాలే జీవనం

KMM: ఇన్నాళ్లు వందలాది కుటుంబాలతో కళకళలాడిన ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. అయితే, భూదాన్ కమిటీ ద్వారా తమకు పట్టాలు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించగా పది ఇళ్లను మాత్రం అధికారులు వదిలేశారు. వీరి ఇళ్లు మిగిలినా చుట్టూ 700వరకు గృహాలను కూల్చివేయడంతో శిథిలాల నడుమ పది ఇళ్లలోని వారు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.