బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాజేష్ నాయక్
MBNR: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు అమర సింగ్ తిలావత్, డి ఎల్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రఘునాయక్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. లంబాడాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.