జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం

వికారాబాద్: జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం ఒకే రోజు ఏకంగా 24 మందిపై దాడి చేశాయి. పరిగి పురపాలికలో వివిధ గ్రామాలకు చెందిన 18 మందితో పాటు కొడంగల్‌లో ఆరుగురు పురపాలిక సిబ్బందిని కరిచాయి. పరిగి పట్టణంలోని ఖాన్ కాలనీ, మార్కెట్ యార్డ్ రోడ్డు, HYD రోడ్డుపై వెళుతున్న వారిపై దాడి చేసి గాయపరిచాయి. అధికారులు స్పందించి కుక్కల దాడులను నివారించాలని కోరుతున్నారు.