భవన నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ తప్పనిసరి: కమిషనర్

భవన నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ తప్పనిసరి: కమిషనర్

KDP: భవన నిర్మాణ యజమానులందరూ తప్పనిసరిగా ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు అనుమతులు తీసుకోని వారికి ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని చెప్పారు. ఇంటి అప్రూవల్ లేని వారు 2026 జనవరి 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకుంటే చట్టబద్ధమైన అనుమతులు జారీ చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.