పులివెందులలో భారీ వర్షం

పులివెందులలో భారీ వర్షం

కడప: పులివెందులలో ఆదివారం సాయంత్రం అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే మబ్బులతో కమ్ముకున్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షంతో పట్టణంలోని ప్రధాన వీధులు జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 రోజులు ఇలాగే వర్షం కొనసాగితే సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.