రేపు సుండుపల్లెలో ఉచిత కంటి వైద్య శిబిరం
అన్నమయ్య: సుండుపల్లెలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు కార్యక్రమం ఉంటుందని వివరించారు. మండల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకు రావాలని సూచించారు.