కేరళం సీఎంకు రేవంత్ కౌంటర్
TG: కేరళం CM పినరయి విజయన్‌కు 'X' వేదికగా సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. 'పాత డేటాతో తప్పుదారి పట్టిస్తున్నారు. కేరళం పేదరికం తగ్గుదల 60 ఏళ్ల పాలన ఫలితం. TG 28 నెలల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీ రూ.10 లక్షలకు పెంచింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం' అని పేర్కొన్నారు.