'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే'

KMM: బీసీకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని మున్నూరు కాపు సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. మున్నూరు కాపులు బీసీలను కలుపుకొని 42 శాతం రిజర్వేషన్ సాధించేలా కృషి చేయాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్ మేయర్ స్థానమే లక్ష్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.