ఈ నెల 16న మాజీ మంత్రి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
బాపట్ల జిల్లాలో ఈ నెల 16వ తేదిన జాతీయ రహదారి ప్రక్కన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రాముఖ్యత కల్పించిన భారతరత్న, మాజీ ప్రధాని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు.