పద్మాక్షి దేవాలయంలో దీపోత్సవం

పద్మాక్షి దేవాలయంలో దీపోత్సవం

HNK: శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ ప్రదోష సమయంలో దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు నాగిళ్ళ శంకర్ శర్మ ప్రారంభించారు. భక్తులకు నూనె, వత్తులు, ప్రమిదలు దేవాలయ ట్రస్ట్ సమకూర్చింది. ఈ ఉత్సవంలో వేదపండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని, పవన్ శర్మ, మాధవకృష్ణ, గాయత్రి, సదానందం, శివ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.