పుంగనూరులో మొదలైన బ్రహ్మోత్సవాలు

పుంగనూరులో మొదలైన బ్రహ్మోత్సవాలు

CTR: పుంగనూరు టౌన్ 29వ వార్డు హనుమంతరాయుని దిన్నె శ్రీవీరాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోకంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేద పండితులు స్వామివారి మూలవిరాట్‌ను ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అంకురార్పణ జరగనుంది.