సింగరేణి లాభాలు ప్రకటించాలని ధర్నా

MNCL: సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి దానిపై 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ మాట్లాడుతూ.. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.