పద్మగిరి కొండపై వైభవంగా షణ్ముఖుని తిరువీధి ఉత్సవం

TPT: తిరుపతి రూరల్ మండలం తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన షణ్ముఖుని తిరువీధి ఉత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తిని పద్మగిరిపై నుంచి తణపల్లి గ్రామానికి తీసుకువచ్చి, ప్రత్యేక అలంకరణల అనంతరం తనపల్లి, నల్లమాను కాలువ, కుంట్రపాకం గ్రామాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిమ గల శ్రీదండాయుధపాణి ఉత్సవమూర్తిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.