తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమలకు సినీ ప్రముఖుల తాకిడి పెరిగింది. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహాదేవన్, డ్రమ్స్ ప్లేయర్ శివమణి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం ఇచ్చారు.