ఎస్సై కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజల వద్దకు పోలీస్ కార్యక్రమం

విశాఖ: గొలుగొండ మండలం రావణపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను 'ప్రజల వద్దకు పోలీస్' కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ కృష్ణారావు పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన వర్క్ పట్ల సైబర్ మోసాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలు మొదలైన వాటిపై, అలాగే ఎన్నికల ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించి, పలు సూచనలు చేశారు.