అన్నదాన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అన్నదాన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PLD: దుర్గి మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండప ప్రాంగణంలో భగవాన్ శ్రీ సత్యసాయి జాతీయ నారాయణ సేవ అన్నదాన భవన నిర్మాణానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం భోజనశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.