వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్య

ప్రకాశం: చీమకుర్తిలో బుధవారం దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బుదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో ఇద్దరు రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం హత్యకు దారి తీసింది. హత్యకు గురైన వ్యక్తి ఓం ప్రకాశ్ (35)గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.