తంబళ్లపల్లెలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

తంబళ్లపల్లెలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

అన్నమయ్య: తంబళ్లపల్లెలో సోమవారం 'ఎయిడ్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు' అనే అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మండలంలోని అన్ని సచివాలయాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. జూనియర్ కళాశాల NSS విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, కృషి సంస్థ, ICTC సభ్యులతో కలిసి జూనియర్ కళాశాల నుంచి MPDO కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.