గంగారం అడవుల్లో పెద్దపులి సంచారం..
MHBD: గంగారం మండలంలోని మహాదేవునిగూడెం, జంగాలపల్లి అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తించడంతో కామారం, దుబ్బగూడెం, జంగాలపల్లి గ్రామాల ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. ఏజెన్సీ గ్రామాల్లో శనివారం డప్పుచాటింపుతో అప్రమత్తం చేస్తున్నారు. సమాచారం కోసం అటవీ శాఖను సంప్రదించాలని అధికారులు కోరారు.