ఏపీ హైకోర్టు లో స్టాండింగ్ కౌన్సిల్ ను అభినందించి:మాజీ మంత్రి

NTR: ఏపీ హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా AP వక్ఫ్ బోర్డు తరపున నందిగామకు చెందిన లాయర్ కరిముల్లా నియమించబడ్డాడు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గొల్లపూడి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కరిముల్లా కలిశారు. ఈ సందర్భంగా కరీముల్లాను అభినందించిన మాజీ మంత్రి ఉమ, శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.