భారీ యంత్రం తరలింపు.. రహదారిపై ట్రాఫిక్ జామ్

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఓ భారీ యంత్రం తరలిస్తున్న వాహనం మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ప్రక్కకు తొలగించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.