ఓ చేతిలో సిగరెట్.. మరో చేతిలో మందు

ఓ చేతిలో సిగరెట్.. మరో చేతిలో మందు

HYD: హయత్‌నగర్‌లోని వర్డ్ & డీడ్ స్కూల్ సమీపంలో నలుగురు యువకులు స్కూటీపై అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తూ హల్చల్ చేశారు. ఒక చేతిలో మందు సీసా, మరో చేతిలో సిగరెట్ పట్టుకుని, తూలుతూ వెళ్లడం తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక నిఘా ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.