MRO ఆఫీస్ మరో బిల్డింగ్‌లో షిఫ్టింగ్‌కు చర్యలు
SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్‌లోని MRO ఆఫీస్ త్వరలో మరో బిల్డింగ్‌లోకి మార్చుతున్నట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ సోమవారం తెలిపారు. స్థానికంగా ఖాళీగా ఉన్న PHC పాత భవనంలో తమ ఆఫీసును షిఫ్టింగ్ చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని మరమ్మతులు చేపట్టి, భవనానికి కలరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.