సైబర్‌ ఉచ్చులో పడొద్దు: ఎస్పీ

సైబర్‌ ఉచ్చులో పడొద్దు: ఎస్పీ

SRPT: సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. ఈరోజు ఎస్పీ పోలీస్‌ కార్యాలయంలో ‘ఫ్రాడ్‌ కాల్‌ ఫుల్‌స్టాప్‌’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అపరిచితుల నుంచి వచ్చే బహుమతులు, లోన్ల ఆఫర్లను నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంక్‌ వివరాలు గోప్యంగా ఉంచాలని, మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు.