గంబుజియా చేప పిల్లలతో దోమల నివారణ చర్యలు

శ్రీకాకుళం: హిరమండలం పీహెచ్‌సీ వైద్యాధికారి పి. సాయికుమార్ ఆధ్వర్యంలో హిరమండలం, సుబలయ చెరువుల్లో గంబుజియా చేప పిల్లలు శనివారం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. 21,800 చేప పిల్లలు వచ్చాయని, వీటిని నీటి నిల్వలు ఉన్న చోట విడిచిపెట్టడం వలన దోమల లార్వా చేపలు భుజించి పెరగకుండా నివారణ చేయవచ్చునని తెలిపారు. వైద్యసిబ్బంది పాల్గొన్నారు.