ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన మంత్రి
NRPT: మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న పనులను ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను, కాంట్రాక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యం కొరకు అల్పాహారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.