పాల్వంచలో భారీ గంజాయి, ఆయుధాల స్వాధీనం

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎక్సైజ్ ఎన్ఫోర్‌మెంట్ అధికారులు భారీగా గంజాయి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో డీసీఎం వ్యాన్, కారులో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.