'ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి'
PLD: జిల్లాలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. అందిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.